Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టైటానిక్ అంటేనే.. విషాద ఘటన గుర్తుకొస్తుంది. వందలాది మంది సముద్ర గర్భంలో కలిసిపోయి వందేండ్లకు పైనే అయినా.. ఇంకా ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయింది. 1912లో సరిగ్గా ఇదే రోజున ఆ ఘటన జరిగింది. నౌకలో ఉన్న దాదాపు 1500 మంది ప్రయాణీకులు దుర్మరణం పాలయ్యారు. ఈ నౌక బ్రిటన్లోని సౌతాంప్టన్ నౌకాశ్రయం నుంచి న్యూయార్క్ వెళ్తుండగా... ఈ ఘోర ప్రమాదం జరిగింది. మొదటగా టైటానిక్ పడవను 20వ శతాబ్దం ప్రారంభంలో ఇంగ్లండ్ ఓడల నిర్మాణ సంస్థ వైట్ స్టార్ లైన్ నిర్మించింది. దీని నిర్మాణం 1909లో ప్రారంభమై.. 1912లో పూర్తయింది. దీనిని ఏప్రిల్ 2న సముద్ర పరీక్ష కూడా నిర్వహించారు. అనంతరం తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ నౌక అనూహ్యంగా ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న పెద్ద మంచుకొండను గుర్తించలేక దానిని ఢకొీట్టింది. ఏప్రిల్ 14-15 రాత్రి సమయంలో ఈ ఓడ పూర్తిగా సముద్రంలోకి జారిపోయింది. అయితే ఈ ప్రమాదం గురించి చాలా ప్రశ్నలు వినిపిస్తుంటాయి. ఓడ కెప్టెన్ స్మిత్... మంచుకొండ హెచ్చరికలను పట్టించుకోలేదని, ఓడ వేగాన్ని తగ్గించకుండా.. ఆ దిశగానే ప్రయాణం కొనసాగించడం వల్లే ప్రమాదం సంభవించిందని చెబుతుంటారు. అదీగాక ఓడ మూడురోజులుగా మంటల్లోనే కాలిపోయిందని కూడా అంటుంటారు. 1997లో ఈ కథ ఆధారంగా రూపొందిన 'టైటానిక్' సినిమాలో ఆనాటి సంఘటనను కండ్లకు కట్టినట్టు చూపించారు.