Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్ మరింత నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి
- అమెరికా అధికారి వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్ అణు ఒప్పందంపై వియన్నాలో జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయని అమెరికా సీనియర్ అధికారి తెలిపారు. వచ్చే వారంలో జరగనున్న చర్చల్లో ఇరాన్ కూడా మరింత నిర్మాణాత్మక వైఖరిని ప్రదర్శించగలదని భావిస్తున్నట్లు తెలిపారు. అణు ఒప్పందం పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై అమెరికా, ఇరాన్ల మధ్య జరిగిన పరోక్ష చర్చలు కేవలం ప్రాధమికమైనవని, కానీ వ్యాపార ధోరణిలో, ఫలితాన్నిచ్చే రీతిలో జరిగాయని విదేశాంగ శాఖ సీనియర్ అధికారి విలేకర్లతో వ్యాఖ్యానించారు. అయితే అదే సమయంలో, అమెరికా ప్రదర్శించిన వైఖరికి అనుగుణంగా ఇరాన్ కూడా ప్రతిస్పందిస్తుందా లేదా అనేది చూడాల్సి వుందని అన్నారు. ఆ ప్రయోజనం నెరవేరుతుందా లేదా అనేది ప్రశ్నగానే మిగిలవుందని అన్నారు. కొన్ని సంకేతాలు ఆ దిశగా కనిపిస్తున్నా, ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. అణు ఒప్పందానికి అనుగుణంగా లేని ఆంక్షలన్నింటినీ ఎత్తివేయడానికి అమెరికా సిద్ధమవుతోందని ఆయన పునరుద్ఘాటించారు. అయితే అంతమాత్రాన అన్ని ఆంక్షలను ఎత్తివేస్తామని కాదని, చట్టబద్ధమైన ఆంక్షలు కొన్ని అమల్లో వుంటాయన్నారు. ట్రంప్ విధించిన ఆంక్షలన్నీ ఒప్పందానికి వ్యతిరేకంగా వున్నవేనని, వాటిని తొలగించాలని శుక్రవారం ఇరాన్ వ్యాఖ్యానించింది. ఒకవేళ ప్రతి ఆంక్షను ఎత్తివేయాలని ఇరాన్ పట్టుబడితే అప్పుడు ఒప్పందం వుండదని, ప్రతిష్టంభన దిశగా సాగాల్సి వుంటుందని అమెరికా అధికారి స్పష్టం చేశారు.