Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రసీలియా: కోవిడ్ మహమ్మారిపై తమ ప్రభుత్వం స్పందించిన తీరుపై సుప్రీం కోర్టు దర్యాప్తుకు అధ్యక్షుడు జైర్ బోల్సనారో తిరస్కరించారు. ఈ దర్యాప్తును చేపట్టడానికి కోర్టుకు ఎలాంటి నైతిక సాహసం లేదని వ్యాఖ్యానించారు. కొవిడ్‌ను ఎదుర్కొన్న తీరుపై సెనెట్ దర్యాప్తు నిర్వహించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి లూయిస్ రాబర్ట్ బారొసో డిమాండ్ చేసిన నేపథ్యంలో అధ్యక్షుని ప్రతిస్పందన వెలువడింది. కాగా, బోల్సనారో వ్యవహార శైలిపై దర్యాప్తుకు ఇది సమయం కాదని సెనెట్ అధ్యక్షుడు పాచెకో భావిస్తున్నారు. అయితే, అధ్యక్షుడు ఈ డిమాండ్‌ను తిరస్కరించడాన్ని ఆయన విమర్శించారు. దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేసిన తర్వాత అన్ని పరిస్థితులు పనిచేసేందుకు, అవసరమైన నిర్ధారణలకు రావడానికి తాను అనుమతిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాల కోసం వచ్చే వారం కోర్టు ప్లీనరీ సమావేశంలో నిర్ణయం జరుగుతుందని మీడియా తెలిపింది.