Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్విటో: ఈక్వెడార్ భవితవ్యాన్ని నిర్ణయించే చారిత్రక ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. రెండు పూర్తి భిన్నమైన దార్శనికతలను కలిగివున్న ఇరువురు అభ్యర్ధులు బరిలో వున్నారు. వామపక్ష ఆర్థికవేత్త ఆండ్రెస్ ఆరుజ్ అవినీతిని నిరోధించి, సామాజిక భద్రతా వ్యవస్థను పెంచాలనే కార్యక్రమంలో బరిలోకి దిగారు. మితవాద బ్యాంకర్ గిలెరెమో లాసో ఎలాంటి నియంత్రణలు లేని స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వైపు దేశాన్ని పయనించేలా చేయాలని చూస్తున్నారు. పరస్పర విరుద్ధమైన ఆర్థిక దార్శనికతలు కలిగిన వీరిలో ప్రజలు ఎవరిని ఎంపిక చేసుకుంటారో చూడాల్సి వుంది. దాన్ని బట్టే దేశ భవితవ్యం ఆధారపడి వుంది. ఏళ్ల తరబడి అధ్యక్షుడు లెనిన్ మోరెనో అనుసరించిన నయా ఉదారవాద విధానాలతో దేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులు దారుణంగా క్షీణించాయి. మాజీ అధ్యక్షుడు రాఫెల్ కరియా చేపట్టిన ప్రగతిశీల, ప్రజానుకూల, లాటిన్ అమెరికా విలీన విధానాలను కొనసాగించడానికి బదులుగా మోరెనో నయా ఉదారవాద చర్యలకే మొగ్గు చూపారు. ఆండ్రెస్ ఆరుజ్కి చెందిన ప్రోగ్రెసివ్ యూనియన్ ఫర్ హౌప్ (యుఎన్ఇఎస్) అలయన్స్‌కు మొదటి రౌండ్లో 32.72శాతం ఓట్లు లభించాయి. అదే సమయంలో లాసోకి 19.74శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.