Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా: భారత ఆర్మీ చీఫ్ జనరల్ నరవనె శనివారం బంగ్లాదేశ్ సైనికాధికారులతో సమావేశమయ్యారు. ఇరు దేశాల సైన్యాల మధ్య స్నేహ సంబంధాలకు గుర్తుగా కాక్స్ బజార్‌లోని రాము కంటోన్మెంట్లో ఒక మొక్కను ఆయన నాటారు. ఐదు రోజుల అధికార పర్యటన నిమిత్తం జనరల్ నరవనె ఢాకాలో పర్యటిస్తున్నారు. బంగ్లాదేశ్ ఆర్మీ 10 ఇన్ఫాంట్రీ డివిజన్‌ను ఆయన సందర్శించారు. ఢాకాలోని బంగబంధు మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించి, బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత షేక్ ముజిబుర్ రహమాన్‌కు ఆయన నివాళులర్పించారు. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ అజిజ్ అహ్మద్ ఆహ్వానం మేరకు నరవనె ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేందుకు రెండు వారాల క్రితమే ప్రధాని మోడీ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 50ఏళ్లు పూర్తయ్యాయి.