Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుత్తాధిపత్యం వ్యతిరేక చర్యల్లో భాగం
బీజింగ్ : చైనా ఇ- కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాకు ఆ దేశ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. గుత్తాధిపత్య వ్యతిరేక చర్యల్లో భాగంగా ఆ సంస్థపై 2.8 బిలియన్ డాలర్లు (రూ.20.500 కోట్లు) జరిమానా విధించింది. మార్కెట్లో ఏకచత్రాదిపత్యం కోసం నిబంధనలను ఉల్లంఘించడంతో ఈ చర్య తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వ ఎజెన్సీలు తెలిపాయి. అలీబాబా గ్రూపు ఇతర సంస్థల నుంచి తనకు పోటీ లేకుండా చేసుకునేందుకు అనేక వ్యూహాల రచిస్తోందని చైనా మార్కెట్ రెగ్యులేషన్ ఆరోపించింది. ఈ జరిమానా విలువ 2019లో కంపెనీ జరిపిన మొత్తం విక్రయాల్లో 4 శాతానికి సమానం కావడం గమనార్హం. గతేడాది అక్టోబర్ 24వ తేదీన జాక్ మా చైనా ప్రభుత్వంపై ఆధారాలు లేని కొన్ని విమర్శలు చేశారు. దీంతో జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూప్ 37 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2,77,000 కోట్లు) ఐపిఒను నిలిపివేసిన చైనా ప్రభుత్వం యాంట్ గ్రూపుతోపాటు అలీబాబాపై యాంటీ ట్రస్ట్ దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే.