Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాలో నల్లజాతి సైనికుడికి పోలీసులు బెదిరింపులు
వాషింగ్టన్ : వర్జీనియాలో ఒక నల్లజాతి సైనికుడి పట్ల కొంతమంది పోలీసులు వ్యవహరించిన తీరు అమెరికాలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై విచారణ చేయాల్సిందిగా వర్జీనియా రాష్ట్ర పోలీస్ విభాగాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ రాల్ప్ నాథమ్ ఆదేశించారు. అమెరికా సైన్యంలో సెకండ్ లెఫ్నినెంట్గా ఉన్న కారోన్ నజారియో గత ఏడాది డిసెంబర్ 5న కొత్తగా కొనుగోలు చేసిన ఎస్యూవీ కారులో ప్రయాణిస్తుండగా విండ్సర్ నగర పోలీసులు అడ్డుకున్నారు. అతడిపట్ల ఇద్దరు పోలీసు అధికారులు అత్యంత దరుసుగా ప్రవర్తించటమేగాక, నజారియోపై పెప్పర్ స్ప్రే చేశారు. ఇక్కడ జరిగింది బయట చెప్పావో..నీ ఆర్మీ కెరీర్ ముగుస్తుందని..బెదిరించారు. తలపై కణతల వద్ద తుపాకీ పెట్టి తీవ్రంగా భయపెట్టారు. ఇదంతా కూడా అక్కడున్న వీడియోలో రికార్డయింది. ఇది సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వటంతో, విండ్సర్ నగర పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసుల దురుసు ప్రవర్తన, అతి..తనని ఎంతగానో బాధించిందని నజారియో కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ ఘటనపై ఏప్రిల్ 5 నుంచి విండ్సర్ పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిని ఒక దురదృష్టకరమైన చర్యగా పోలీసు అధికారులు ప్రకటించారు. నజారియోను అడ్డుకున్న ఇద్దరు పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.