Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : కోవిడ్-19 ఇప్పట్లో అంతం కాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం గెబ్రేయేసస్ అన్నారు. కరోనా మహమ్మారిని అంతం చేయడానికి టీకాలు మాత్రమే సరిపోవన్నారు. అయితే వ్యాక్సిన్లు చాలా శక్తిమంతమైనవని, ప్రభావవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. ఏ తప్పులు చేయకుండా కరోనాపై పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. గత ఆరు వారాలుగా మహమ్మారి విజంబిస్తున్నదని, ముఖ్యంగా నాలుగు వారాల నుంచి కరోనా మరణాలు ఎక్కువయ్యాయన్నారు. ప్రపంచం మునుపటిలా ఉండాలని, ఆర్థిక వ్యవస్థ తెరుచుకొని బలపడాలని అందరికీ ఉందని.. కానీ చాలా దేశాల్లో ప్రజలు ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో కూడా చాలా కాలం పాటు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, అయితే... దీనిపై తాము పూర్తి అవగాహనకు రాలేదని అన్నారు.