Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్లర్లలో ఇద్దరు పోలీసు అధికారుల మృతి
లాహోర్ : కరడుగట్టిన ఇస్లామిక్ ఛాందసవాద సంస్థ 'తెహ్రిక్ ఇ లబేక్ పాకిస్తాన్ ' (టిఎల్‌పి) నేత సాద్ రిజ్వీ అరెస్టుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మ కంగా మారాయి. రెచ్చిపోయిన టిఎల్‌పి అను చరులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ లో ఇద్దరు పోలీసు అధికారులు చనిపోయా రు. మరో 125 మంది వరకు గాయపడినట్లు పోలీస్ చీఫ్ గులాం మహమూద్ డోగర్ బుధవారం తెలిపారు. ఇస్లామ్‌కు వ్యతిరేకంగా దైవదూషణకు పాల్పడడాన్ని నిరసిస్తూ టిఎల్‌పి నిరసనలకు పిలుపునిచ్చింది. ఆ ప్రదర్శనలకు ముందుగా వారి నేత సాద్ రిజ్విని సోమవారం లాహౌర్‌లో అరెస్టు చేశారు. పోలీసు కానిస్టేబుల్హత్యకు పాల్పడ్డారన్న అభియోగాలపై రిజ్వీపై కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేసి చనిపోయేలా కొట్టారని అధికారులు చెబుతున్నారు. సోమ, మంగళవారాల్లో దేశంలోని ప్రధాన రహదారులను ఆందోళనకారులు దిగ్బంధించారు.