Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జపాన్‌కు చైనా సూచన
బీజింగ్ : అణు ధార్మికతతో కూడిన వ్యర్ధ జలాలను జపాన్ చుట్టుపక్కల గల సముద్రా ల్లో పారబోయవచ్చంటూ అమెరికా పట్టుబడు తున్నందున ఆ నీటిని అమెరికాకే పంపించా లని చైనా సూచించింది. ఈ మేరకు బుధ వారం చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రెండు ట్వీట్లు చేశారు. ఫుకుషిమా ప్లాంట్‌కి చెందిన పది లక్షల టన్నులకు పైగా అణు ధార్మికత కలిగిన వ్యర్ధ జలాలను సముద్రంలో పారబోయాలన్న జపాన్ ప్రణాళికల పట్ల చైనా తన తీవ్ర వ్యతిరేకతను తెలియజేసింది ''ఫుకు షిమా అణు వ్యర్ధజలాలు అంతర్జాతీయ భద్ర తా ప్రమాణాలకు అనుగుణంగానే వున్నా యని, తాగడానికి కూడా బాగున్నాయని జపాన్, అమెరికా చెబుతున్నాయి. అటువంట పుడు ఆ నీటిని వారెందుకు అట్టిపెట్టు కోకూడదు? లేదా అమెరికాకు నౌకల్లో ఎందుకు తరలించకూడదు?'' అని విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చునియాంగ్ ప్రశ్నిం చారు. ఈ వ్యర్ధ జలాలు తాగునీటిని, మానవ ఆరోగ్యాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తాయో తెలియజేేసేలా కార్టూన్లు కూడా ఆ ట్వీట్లతో పాటు దర్శనమిచ్చాయి. ఈ నీటిని ఎవరైనా తాగడానికి ముందుగా వాటి భద్రతపై అంత ర్జాతీయ నిపుణులతో సమీక్ష జరిపించడం మంచిదని సూచించారు. రెండేళ్ళలోగా ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్ నుండి వ్యర్ధ జలాలను సముద్రంలోకి విడుదల చేస్తామని జపాన్ సోమవారం ప్రకటించింది. జపాన్ పొరుగు దేశాలన్నీ ఆ ప్రతిపాదనను వ్యతిరేకి స్తున్నాయి. ఇది అత్యంత బాధ్యతరాహిత్య చర్య అని మంగళవారం చైనా విమర్శించింది. పొరుగుదేశాలతో, సంబంధిత పక్షాలతో తక్షణమే చర్చలు జరపాలని పిలుపునిచ్చింది.