Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐక్యరాజ్యసమితి : కోవిడ్ విజృంభించిన సమయంలో లైంగిక హింస పెరిగిందని ఐక్యరాజ్యసమితి (యుఎన్) తాజా నివేదిక వెల్లడించింది. మొత్తం 18 దేశాల్లో 52 సైన్యాలు లేదా సాయుధ మూకలు మహిళలపై అకృత్యాలకు పాల్పడినట్లు తమ వద్ద అధికారిక సమాచారం ఉందని ఆ నివేదిక పేర్కొంది. పలు దేశాల్లో సైన్యాలు, సాయుధ మూకలు లైంగిక హింసను ఒక యుద్ధవ్యూహంగా, రాజకీయ అణచివేతకు సాధనంగా ఉపయోగించుకుంటున్నాయని తెలిపింది. ఈ జాబితాలో ఉన్న ప్రభుత్వ దళాలను లేదా అధికారిక పోలీసు బలగాలను ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధించినట్లు తెలిపింది. ఈ బ్లాక్‌లిస్ట్‌లో కాంగో, దక్షిణ సూడాన్‌లోని ప్రభుత్వ, పోలీసు బలగాలు, సిరియా నిఘా వర్గాలు, సూడాన్‌లో సాయుధ బలగాలు ఉన్నాయి.