Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిన్నెసొటా : 20ఏళ్ళ నల్ల జాతీయుడు డాంటె రైట్ హత్యను నిరసిస్తూ వరుసగా మూడో రోజు రాత్రి కూడా వందలాదిమంది ప్రజలు మిన్నెసొటాలోని బ్రూక్లిన్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసు అధికారులు బాష్పవాయువును ప్రయోగించారు. రాత్రి పదిగంటల సమయంలో బ్రూక్లిన్ సెంటర్లో కర్ఫ్యూ విధించారు. డాంటె రైట్ ఆదివారం మధ్యాహ్నం ట్రాఫిక్ స్టాప్ దగ్గర జరిగిన కాల్పుల్లో మరణించాడు. పోలీసు అధికారి కిమ్ పాటర్ పొరపాటున జరిపిన కాల్పుల్లో రైట్ చనిపోయారని సోమవారం బ్రూక్లిన్ సెంటర్ పోలీసు చీఫ్ టిమ్ గానన్ విలేకర్లకు తెలిపారు. నిరసనాగ్రహాలు పెల్లుబకడంతో టిమ్ గానన్ , కిమ్ పాటర్ రాజీనామా చేశారు.
దళాల ఉపసంహరణ గడువు సెప్టెంబరు 11కి పొడిగింపు
ఈ ఏడాదికి మే ఒకటో తేదీకల్లా ఆప్ఘనిస్తాన్ నుంచి తన దళాలను వెనక్కి తీసుకుంటానని చెప్పిన అమెరికా ఇప్పుడు ఆ గడువును సెప్టెంబరు 11కి పొడిగించింది. సెప్టెంబరు 11 దాడులు జరిగి 20ఏళ్ళు అవుతున్నందున అప్పటి కల్లా ఆఫ్ఘనిస్తాన్ నుండి అంచెలంచెలుగా తన బలగాలను ఉపసంహరించుకుంటామని అమెరికా చెబుతోంది. ట్రంప్ గతంలో విధించిన మే 1 గడువులోగా దళాల ఉపసంహరణ సాధ్యం కాదని సన్నాయి నొక్కులు నొక్కుతూ వస్తున్న బైడెన్ చివరికి ఈ గడువును మరో అయిదు నెలలపాటు పొడిగించారు. ఇప్పటికీ 2500మంది అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్తాన్లో తిష్టవేశారు.