Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెపిడా : మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆందోళనకారులు తాజాగా 'బ్లడీ పెయింట్ స్ట్రైక్' పేరుతో సరికొత్త నిరసన చేపట్టారు. ఆందోళనలను నెత్తుటిలో ముంచుతున్న సైనిక నియంత అమానుష త్వానికి సంకేతంగా వారు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల వెలుపల రోడ్లపైన, చిహ్నాలపైన ఎర్రటి పెయింట్‌ను, రంగును అద్దారు. అన్ని పట్టణాలు, నగరాల్లో ఈ తరహా నిరసనలు చేపట్టారు. పదవీచ్యుతురాలైన నేత సూకీని తక్షణమే విడుదల చేయాలని కొంతమంది ప్రదర్శనలకు దిగారు. ఫిబ్రవరి 1న సైనిక కుట్ర జరిగిన నాటి నుండి ఆమె నిర్బంధంలోనే వున్నారు. అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలను ఆమె తరపు న్యాయవాదులు వీటిని తిరస్కరిస్తున్నారు. మహిళలతో సహా వేలాదిమంది ప్రజలు మండాలే నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలపై కూడా సైనిక నియంత ఆంక్షలు విధించారు. మంగళవారం నుండి ఐదు రోజుల పాటు మయన్మార్‌లో నూతన సంవత్సర సెలవులు. పండుగ కార్యకలాపాలన్నింటినీ ఆందోళనకారులు రద్దు చేసుకున్నారు.