Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా : మాంసాహార మార్కెట్లలో వన్యప్రాణుల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రపంచదేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ వంటి 70శాతం అంటువ్యాధులు ప్రబలడానికి ఈ వన్యప్రాణులే కారణమని సంస్థ తెలిపింది. వైరస్ సోకిన జంతువుల శరీర ద్రవాలను తాకినప్పుడు అవి మానవులకు సంక్రమించే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈ వన్యప్రాణులను ఉంచిన ప్రదేశాల్లో వాతావరణం కలుషితమవడం మరింత ప్రమాదకరమని పేర్కొంది. ఇటువంటి జంతువుల అమ్మకాలను నిషేధించడం వల్ల విక్రేతలు, మార్కెట్కు వచ్చే ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని సూచించింది.