Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : అమెరికాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై రాజీలేని పోరు సాగించిన ప్రముఖ హక్కుల కార్యకర్త, న్యాయనిపుణుడు, ప్రగతిశీలి రామ్సే క్లార్క్ (93) న్యూయార్క్‌లోని మన్‌హటన్‌లో ఈ నెల9న కన్నుమూశారు. ఇతర దేశాలపై అమెరికా సాగించే దురాక్రమణలు, యుద్ధాలు, ఆంక్షలు మానవాళికే పెను ముప్పు అని ఆయన విమర్శించేవారు. 120కి పైగా దేశాల్లో పర్యటించారు. అమెరికా దురాక్రమణ యుద్ధాల్లో బాధితులకు ఆయన సంఘీభావంగా నిలిచేవారు. ఉత్తర వియత్నాం, పనామా వంటి దేశాల్లో అమెరికా సాగించిన అత్యాచారాలకు వ్యతిరేకంగా గట్టిగా గళం వినిపించారు. ఇరాక్‌పై అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా 12ఏళ్ళ పాటు అంతర్జాతీయ ప్రచారోద్యమం నడిపారు. శాంతి, సమానత్వం, సామాజిక, ఆర్థిక న్యాయ హక్కులన్నీ మానవ హక్కులేనని ఆయన పునరుద్ఘాటించారు. పాలస్తీనా హక్కులకు ఆయన బాసటగా నిలబడ్డారు. 2012లో క్యూబా ఆయనను సాలిడారిటీ మెడల్‌తో సత్కరించింది. 1927 డిసెంబరు 18న జన్మించిన రామ్సే క్లార్క్ అమెరికా అటార్నీ జనరల్‌గా తర్వాత సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు.