Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రూ క్లిన్సెంటర్ వద్ద వందలాది మంది అరెస్టు
- నల్లజాతి యువకుడి హత్యపై ఆగ్రహం
వాషింగ్టన్ : అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో బ్రూక్లిన్ సెంటర్ వద్ద నిరసనలు హోరెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం డాంటే రైట్ అనే నల్లజాతి యువకుడ్ని పోలీసులు కాల్చిచంపిన కారణంగా ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం పెల్లుబుకుతోంది. గత మూడు రోజులు వరుసగా బ్రూక్లిన్ సెంటర్ వద్ద నిరసనలు ఆగటం లేదు. అక్కడికి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిరసనలు శాంతియు తంగా కొనసాగుతున్నప్పటికీ బుధవారం మధ్యాహ్నం వందలాది మంది నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. నిరసనల్ని అడ్డుకునేందుకు మిన్నెసోటా రాష్ట్ర ప్రభుత్వం 'సేఫ్టీ నెట్' పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇందుకోసంగానూ లా ఎన్ఫోర్స్మేంట్ అధికారుల్ని పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపింది. బ్రూక్లిన్ సెంటర్ పోలీస్ డిపార్మెంట్ భవనం వద్ద నిరసన తెలుపుతున్న వారికి మంగళవారం రాత్రి పోలీసు అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఇక్కడ ఎవరూ గుమికూడరాదు, ఇక్కడ్నుంచి వెళ్లిపోండి..అని ఆదేశాలు జారీచేశారు. దాంతో అక్కడ కొన్ని గంటలపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత మూడు రోజులుగా బ్రూక్లిన్ సెంటర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో పాల్గొనడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వేలాది కార్లలో తరలివచ్చిన జనం..అమెరికాలో జాతి వివక్షపై ఆందోళన వ్యక్తం చేశారు. డాంటే రైట్ హత్యపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం నుంచి నగరంలో పలు చోట్ల నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. మిన్నెసోటాలోని ఎఫ్బీఐ ప్రధాన కార్యాలయం ముందు నుంచి నిరసన ర్యాలీలు కొనసాగాయి. రైట్ను హత్య చేసిన మాజీ పోలీస్ అధికారి కిమ్ పోటర్ను వెంటనే శిక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.