Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన లైంగిక హింస : ఐక్యరాజ్యసమితి
ఐక్యరాజ్యసమితి: గతేడాది కోవిడ్మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో లైంగిక హింస పెరిగిందనీ ఐక్యరాజ్యసమితి (యూఎన్) తాజాగా నివేదికను వెల్లడించింది. కోవిడ్ సమయంలో మొత్తం 18దేశాల్లో 52సైన్యాలు లేదా సాయుధ మూకలు మహిళలపై అకత్యాలకు పాల్పడి నట్టు తమ వద్ద ధ్రువీకత సమాచారం ఉందని ఆ నివేదికలో స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సైన్యాలు, సాయుధ మూకలు... లైంగిక హింసను ఒక యుద్ధవ్యూహంగా, రాజకీయ అణచివేతకు ఉపయోగించుకున్నాయని తెలిపింది. నివేదికలో.. ''ఈ దారుణాలకు పాల్పడుతున్న వాటిలో అత్యధిక శాతం ప్రభుత్వేతర మూకలు ఉన్నాయి. ప్రతిపక్షాలు, తిరుగుబాటు బృందాలు, అల్‌ఖైదా లేదా (ఐఎస్)తో సంబంధ మున్న ఉగ్రమూకలు ఎక్కువగా ఉన్నాయి.