Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికా ప్రభుత్వంలోని రెండు కీలక పదవులకు మరో ఇద్దరు భారతీయ -అమెరికన్లను ఎంపిక చేసినట్లు బైడెన్ బుధవారం ప్రకటించారు. అటార్నీ జనరల్, ఎగ్జిక్యూటివ్ పదవులకు ఇద్దరు భారతీయ- అమెరికన్ మహిళలను నామినేట్ చేసినట్లు బుధవారం బైడెన్ వెల్లడించారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన పరిపాలనలో చేరిన మీరాజోషి, రాధిక ఫాక్స్‌లకు ఈ నామినేషన్ల ద్వారా పదోన్నతి కల్పించారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. రవాణాశాఖలోని వాహనాల నియంత్రణ, భద్రత కార్యనిర్వాహకురాలిగా మీరా జోషి, నీరు, పర్యావరణ భద్రత సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా రాధిక ఫాక్స్ నామినేట్ అయినట్లు వైట్‌హౌస్ తెలిపింది. వీరితో పాటు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజన్సీ (ఇపిఎ) చీఫ్ ఫైనాన్షియల ఆఫీసర్‌గా పైసల్ అమీన్‌ను బైడెన్ నామినేట్ చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.