Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాంగాస్ : మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు నిరసనగా ఉద్యమకారులు నూతన సంవత్సర వేడుకల (థింగ్యాన్)ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సాంప్రదాయంగా ఐదురోజుల పాటు జరిగే ఈ వేడుకలను రద్దు చేసుకున్నా.... దానికిబదులుగా దేశవ్యాప్తంగా ప్రదర్శనలు చేపట్టి... తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. కాగా, మొదటిరోజుగా.. కుండల్ని పూలతో అలంకరించి.. చేయి గుర్తు పెట్టి తమ నిరనను వ్యక్తం చేశారు. ఇప్పుడు రెండో రోజు నిరసనగా.. ఉద్యమకారులు ప్రభుత్వ కార్యాలయాల వెలుపల, రహదారులపై రక్తపు మరకలను పెయింట్ వేశారు. సైనిక హత్యలకు వ్యతిరేకంగా... మిలటరీని అవమానించే లక్ష్యంతోనే... వివిధ నగరాల్లో, పట్టణాల్లో ఇలా రెడ్ పెయింట్ వేశారు. అలాగే కొంతమంది అంగ్‌సాన్ సూకీని విడుదల చేయాలని సంకేతంగా.. కవాతు చేశారు. ఆ దేశంలో రెండవ నగరమైన మాండలేలో జరిగిన కవాతులో ఓ యువతి 'దయచేసి మా నాయకురాలిని.. భవిష్యత్తును.. ఆశను... కాపాడండి' అంటూ ప్రచురించిన ఒక ప్లకార్డును పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అయితే స్థానిక మీడియా సమాచారం ప్రకారం... బుధవారం జరిగిన నిరసనలలో హింసకు సంబంధించిన నివేదికలు లేవు. జుంటా సైన్యం అడ్డుకోవడం వల్ల.. సమాచారం కొరత ఏర్పడిందని మీడియా వర్గాలు తెలిపాయి.