Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి త్రైమాసికంలో జీడీపీ 18.3శాతం
బీజీంగ్ : ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ లు కరోనా మహమ్మారి ధాటికి విలవిలలాడుతేంటే.. చైనా మాత్రం దీనికి విరుద్ధంగా దానిని తట్టుకొని నిలబడింది. కష్టకాలంలోనూ ఆకాశమే హద్దుగా ఆర్థిక వృద్ధి రేటును సాగిస్తున్నది. తొలి త్రైమాసికంలో ఆ దేశ జీడీపీ 18.3 శాతానికి చేరుకున్నది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థ నమోదు చేస్తున్న రికార్డులకు అద్దం పడుతు న్నది. 1992 నుంచి చైనా త్రైమాసిక రికార్డులను గణిం చడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే అతిపెద్ద వేగవంతమైన వృద్ధి రేటు కావడం గమనార్హం. వాస్త వానికి ప్రపంచంలోని మిగతా దేశాల లాగానే కరోనాతో చైనా ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొన్నది. లాక్డౌన్లు, తదితర ఆంక్షల కారణంగా గతేడాది తొలి త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి 6,8శాతం క్షీణించింది. అయితే, చివరి ఆర్థిక సంవత్సరంలో కరోనా మహమ్మారి ధాటిని తట్టుకొని చైనా నిలబడింది. పాజిటివ్ జీడీపీని నమోదు చేసుకున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన ఏకైక దేశంగా చైనా నిలిచి ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, బలమైన ఇండిస్టియల్ అవుట్‌పుట్, ఎగుమతుల ద్వారానే చైనా దీనిని సాధించగలిగిందని బ్లూంబర్గ్ వెల్లడించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశీయంగా, విదేశాలలో బలమైన డిమాండ్‌తో, చిన్న పరిశ్రమలకు చైనా ప్రభుత్వం అందించిన మద్దతుతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని అందించిందని రాయిటర్స్ వెల్లడించింది.