Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలోని ఇండియానా పోలిస్ నగరంలో ఫెడెక్స్ డెలివరీ సంస్థ వద్ద సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మహిళలతో సాహా నలుగురు భారత అమెరికన్లు మరణించారు. వీరంతా సిక్కు సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అనంతరం దుండగుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అమర్జీత్ కౌర్ , జస్వీందర్ కౌర్, అమర్జీత్ కౌర్ జోహల్, జస్వీందర్ సింగ్ మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. సెక్లాన్ నిందితుణ్ణి 19 ఏళ్ల బ్రాండన్ స్కాట్ హోల్గా గుర్తించారు. గాయపడ్డ హర్‌ప్రీత్ సింగ్ గిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇండియానా పోలిస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఫెడెక్స్ ఆపరేషన్స్ సెంటర్ వద్ద ఈ స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఫెడెక్స్ సర్వీస్‌లో 90 శాతం మంది భారత అమెరికన్లు ఉద్యోగులు ఉన్నారు. ఈ ఘటన హృదయ విదారకమని సిక్కుల నేత గురీందర్ సింగ్ ఖలాసా తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,ఉపాధ్యక్షులు కమలా హారీస్ తీవ్ర సంతాపం ప్రకటించారు.