Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా, అమెరికా సంయుక్త ప్రకటన
బీజింగ్ : వాతావరణ మార్పుల సమస్యపై కలిసి పని చేసేందుకు కట్టుబడి ఉన్నామని చైనా, అమెరికా ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. వాతావరణ పరిరక్షణకు సంబంధించి ఉన్న పారిస్ ఒప్పందంతో సహా ఇతర బహుపాక్షిక రంగాల్లో పరస్పరం సహకరించుకుం టామని పేర్కొన్నాయి. అమెరికా వాతావరణ ప్రతినిధి జెన్కెర్రీ చైనాలోని షాంఘై పర్యటన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇతర దేశాలతో కలిసి చైనా, అమెరికాలు కలిసి పనిచేస్తా యని తెలిపింది. ఇందుకు సంబంధించి ఇరుదేశాలు తీసుకుంటున్న చర్యలను మరింత బలోపేతం చేస్తామని.. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్, పారిస్ ఒప్పందం వంటి బహుపాక్షిక రంగాల్లో సహకరించుకుంటామని చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈఉమ్మడి ప్రకటనపేర్కొంది. పారిస్ ఒప్పందం అమలును ఇరుదేశాలు ఈ సందర్భంగా నొక్కిచెప్పాయి. ఒప్పందంలో నిర్ణయించిన విధంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 సెంటీగ్రేడ్ల కన్నా తక్కువగా ఉండేలా.. 1.5 సెంటీగ్రేడ్లకు పరిమితం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశాయి.