Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : భారత ప్రయాణికులను రెడ్‌లిస్ట్‌లో చేరుస్తున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత్ నుండి వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా 10రోజుల పాటు హౌటల్లో క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుండి వచ్చే వారిని కూడా ఇదే జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించింది. బ్రిటన్‌కి చేరుకున్న 103 మంది ప్రయాణికుల్లో భారత్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్‌ను గుర్తించినట్లు ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్ హ్యాంకాక్ తెలిపారు. దీంతో ఆయా దేశాల నుండి వచ్చే ప్రయాణికులు ప్రభుత్వం నిర్దేశించిన హౌటల్స్‌లో పదిరోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని, అందుకు అవసరమైన ఖర్చులు వారే భరించాల్సి వుంటుందని అన్నారు. ఈ నిర్ణయం కఠినమైనదే అయినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తీసుకోకతప్పలేదని మాట్ హ్యాంకాక్ అన్నారు. కాగా, మరోమారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 25న ఆయన భారత్‌లో పర్యటించాల్సివుంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు.