Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెర్లిన్ : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చాన్సలర్ పదవికి మధ్యే మితవాద సీడీయూ-సీఎస్యూ యూనియన్ అభ్యర్థిగా సిడియు చైర్మన్ అర్మిన్ లాచెట్ బరిలోకి దిగనున్నారు. పార్టీ అగ్ర నేతలందరూ ఆయనకు మద్దతిచ్చారు. ఏంజెలా మెర్కెల్ స్థానంలో అలయన్స్ అభ్యర్థిగా లాచెట్ను నిలబెట్టాలా లేక సిఎస్యు నేత మార్కస్ సోడర్ను దింపాలా అనే సోమవారం సీడీయూ ఎగ్జిక్యూటివ్ బోర్డు చర్చించింది. ఈ ఎన్నికల్లో తిరిగి పోటీ చేయరాదని, తన వారసుడి ఎంపిక క్రమానికి కూడా దూరంగా వుండాలని ఆమె భావిస్తున్నారు. మెర్కెల్కి చెందిన క్రిస్టియన్డెమోక్రాట్స్ (సీడీయూ), క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్యూ)తో కలిసి సంకీర్ణంగా పోటీ చేస్తోంది. అయితే లాచెట్, సోడర్లు ఇరువురూ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని కోరుకుంటుండడంతో రెండు పార్టీల మధ్య ఐక్యత కొనసాగించేందుకు ప్రయత్నాలు చేశారు. సీడీయూ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఎంపిక చేసిన వారిని అంగీకరిస్తానని సోడర్ చెప్పారు. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం లాచెట్ పేరు బయటకు వచ్చింది. సమావేశంలో 46మంది సభ్యులకు గానూ 31మంది లాచెట్కే మొగ్గుచూపారు. సోడర్కి కేవలం 9 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో ఆరుగురు గైర్హాజరయ్యారు.