Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాధినేతలకు వందకు పైగా అంతర్జాతీయ సంస్థల లేఖ
వాషింగ్టన్ : ప్రకృతిపై యుద్ధానికి చరమగీతం పాడాలని వందకు పైగా అంతర్జాతీయ సంస్థలు, సామాజిక ఉద్యమాలు, పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ప్రపంచ దేశాల అధినేతలకు అవి బహిరంగంగా ఒక లేఖ రాశాయి. వాతావరణంలో కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకువచ్చేందుకు దీర్ఘకాలికమైన సాహసోపేత చర్యలు తీసుకోవాలని కోరాయి. వాతావరణ విపత్తులను, పేద దేల ప్రజల సామాజిక, ఆర్థిక విపత్తుల ప్రభావాలను నివారించేందుకు అవసరమైన విధానాలు రూపొందించాలని కోరాయి. ప్రాధాన్యతా క్రమాల్లో సమూలమైన మార్పులు తీసుకురావల్సిన ఆవశ్యకతను అవి గుర్తు చేశాయి. అధిక లాభాల కోసం దురాశతో సాగిస్తున్న నేరాల వల్ల తీవ్రమైన పర్యావరణ, ప్రజారోగ్య సంక్షోభం తలెత్తుతోంది. పట్టణ, పల్లె ప్రాంతాలన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వీటి పర్యవసానాలను, దుష్ప్రభావాలను అనుభవిస్తూనే వున్నారు. ప్రస్తుతమున్న రీతిలోనే భూ వినియోగం, అడవులు నరికివేత, గనుల తవ్వకాలు, జీవవైవిధ్యాన్ని నాశనం చేసే క్రిమిసంహారక మందులపై ఆధారపడడం, వేగంగా సాగుతున్న పట్టణీకరణ క్రమం వంటివి ఇలాగే కొనసాగితే 450కోట్ల మందికి పైగా ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారని, వారికి నాణ్యత గల ఆహారం, నీరు కూడా దొరకకుండా పోతుందని శాస్త్రీయ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పుల వల్ల ప్రజల జీవనం, వ్యవసాయ ఉత్పాదకత ప్రభావితమవుతున్నాయి. కాబట్టి పర్యావరణ సంక్షోభం వుందా అన్న ప్రశ్నకే తావు లేదు. దాన్ని ఎలా పరిష్కరించాలన్నదే ఇక్కడ సమస్య అని ఆ లేఖలో పేర్కొన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, బ్యాంకులు, బహుళజాతి సంస్థల ఆధీనంలో వున్న ఆర్థిక వ్యవస్థలన్నీ కలిసి ప్రకృతిని నాశనం చేస్తున్నాయని విమర్శించాయి. ఈ పరిస్థితుల్లో యావత్ సమాజాన్ని, సంస్థలను ప్రజా ఉద్యమాలను, శాస్త్రవేత్తలను, పర్యావరణ సంస్థలను సమీకరించి, తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై ఒక ఒప్పందానికి రావాల్సిన అవసరం వుందని వందకుపైగా సంస్థలు ఆ లేఖలో పేర్కొన్నాయి.
చైనా నేత హాజరుతో అమెరికా వాతావరణ ఎజెండాకు ఎదురు దెబ్బే!
వాతావరణ మార్పులపై అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైన శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షులు సీ జిన్పింగ్ హాజరుకావడం హాజరుకావడం ప్రపంచ నేతల మధ్య సుహృద్బావానికి సంకేతంగా భావిస్తున్నారు. జనవరిలో బైడెన్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత చైనా నేతతో జరుపుతున్న తొలి వర్చువల్ సమావేశం ఇది. ఎన్ని విభేదాలున్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాల్లో సహకారమే అత్యంత కీలకమనే మౌలిక వైఖరికి అనుగుణంగానే జిన్పింగ్ ఈ చర్య తీసుకున్నారు. అదే సమయంలో అమెరికా నేతృత్వంలోని వాతావరణ ఎజెండాకు చెక్ పెట్టేందుకు ఇదొక అవకాశంగా చైనా భావిస్తున్నది. వాతావరణ మార్పులపై అగ్రరాజ్యం అమెరికా ఆడుతున్న నాటకాన్ని ఎండగట్టాలన్న సంకల్పంతో చైనా ఉంది. ఈ విషయంలో చైనాకు రష్యా మద్దతు ఎలాగూ ఉంటుంది. ఈ విషయంలో అమెరికా గుత్తాధిపత్యాన్ని తాము అంగీకరించేది లేదని చైనా నిపుణులు కొందరు పేర్కొంటున్నారు. కేవలం కొన్ని దేశాలు అంతర్జాతీయ వ్యవహారాలను నిర్దేశించలేవని అంటూ నూతన ప్రపంచ వ్యవస్థ కోసం జిన్పింగ్ పిలుపివ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రపంచ దేశాలు న్యాయం కావాలని కోరుతున్నాయని, గుత్తాధిపత్యం కాదని స్పష్టం చేశారు.