Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని ఒక హౌటల్లో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, 12 మందికి పైగా గాయపడ్డారు. క్వెట్టా సిటీలో గల ఒక ప్రముఖ హౌటల్లోని పార్కింగ్ ప్రదేశంలో ఈ పేలుడు జరిగింది. ఈ హౌటల్లో చైనా రాయబారితో సహా నలుగురు ప్రతినిధి సభ్యులు ఉన్నారు. వీరితో రాయబారి సమావేశం నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని పాక్ హౌంశాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు. ఇది ఉగ్రదాడి కావచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ బాంబు పేలుడుకు తమదే బాధ్యత అని ఇప్పటివరకు ఏ గ్రూపు ప్రకటించలేదు. ఈ ఘటన పట్ల చైనా ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా, క్వెట్టా సిటీలో పలు లగ్జరీ హౌటళ్లు ఉన్నాయి. ఈ హౌటళ్లలో అధికంగా చైనా నేతలు బస చేస్తుంటారు.