Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : భారత్ నుంచి అదనపు విమానాలను అనుమతించేందుకు నిరాకరించినట్టు బ్రిటన్‌లోని హిత్రో విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఎక్కువ మంది ప్రయాణికులను అనుమతించడం ద్వారా వైరస్ మరింతగా వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటంతో.. బ్రిటన్ ప్రభుత్వం భారతీయ ప్రయాణికులను రెడ్‌లిస్ట్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. ఇటీవల భారత్ నుంచి బ్రిటన్ చేరుకున్న ప్రయాణికుల్లో 100కుపైగా భారత్ కరోనా వేరియంట్‌ను గుర్తించినట్టు ఆరోగ్య శాఖ మంత్రి హ్యాంకాక్ తెలిపారు. భారత్‌ను రెడ్ లిస్ట్‌లో చేర్చాలన్న నిర్ణయాన్ని తీసుకున్నామని.. ఇది కష్టతరమైనప్పటికీ.. తప్పలేదని అన్నారు. 10 రోజుల నుండి భారత్‌లో నివసిస్తున్న వారు బ్రిటన్‌వారు అయినప్పటికీ.. బ్రిటన్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి లేదని హ్యాంకాక్ పార్లమెంటులో తెలిపారు.