Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యన్ కమ్యూనిస్టు పార్టీ విజ్ఞప్తి
మాస్కో : అక్టోబర్ మహా విప్లవ సారథి, ఇరవయ్యో శతాబ్ది చరిత్ర గతినే మార్చేసిన మహోన్నత నేత వ్లాదిమిర్ లెనిన్ విగ్రహాలు, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చాలని రష్యన్ కమ్యూనిస్టు పార్టీ కోరింది. లెనిన్ 151వ జయంతిని పురస్కరించుకుని రష్యన్ కమ్యూనిస్టు పార్టీ నేత మాక్సిం సూరేకిన్ ఈ మేరకు ఐక్యరాజ్య సమితికి, యునెస్కోకు విజ్ఞప్తి చేశారు. ''ఈ ప్రపంచంలో గొప్ప ఆలోచనాపరుల్లో ఒకరు. మెరుగైన భవిష్యత్ కోసం ప్రపంచ చరిత్ర గతినే మార్చివేసిన మహనీయుడు లెనిన్ అని ఆయన పేర్కొన్నారు. లెనిన్ కృషి ఫలితంగా ఇప్పటికీ 8 సోషలిస్టు దేశాలు వున్నాయి. అందులో అతిపెద్దది చైనా. ప్రపంచ జనాభాల్లో దాదాపు నాల్గో శాతం అక్కడే వున్నారని సూరేకిన్ పేర్కొన్నారు. రష్యాలో ప్రతి పల్లె, పట్టణంలో లెనిన్ విగ్రహం వుంది, రష్యా వార్తాపత్రిక అంచనా ప్రకారం 2003లో దాదాపు 1800 విగ్రహాలు, 20వేల బస్ట్ సైజ్ విగ్రహాలు వున్నాయి. ప్రస్తుతం యునెస్కో జాబితాలో 869 సాంస్కృతిక ప్రాంతాలు వున్నాయి. వీటిలో రష్యాకి చెందినవి 18 వున్నాయి. 1990లో క్రెమ్లిన్, రెడ్ స్క్వేర్లను ఇందులో చేర్చారు. మొత్తంగా ఈ ప్రపంచంలో వున్న సాంస్కృతిక వారసత్వం పట్ల యునెస్కో నేతలు జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.