Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవలం రూ.75కే డోస్
- అన్ని వేరియంట్లను నిరోధించే సామర్థ్యం
- రూపొందించిన వర్జీనియా విశ్వవిద్యాలయం
వాషింగ్టన్ : కరోనా మహ మ్మారిని నిరోధించే సరికొత్త వ్యాక్సిన్ త్వరలో అందుబాటు లోకి వచ్చే అవకాశాలు చిగురి స్తున్నాయి. ఈ వ్యాక్సిన్ ప్రస్తు తం ఉన్న కరోనా వేరియంట్ల తోపాటు భవిష్యత్తులో రానున్న కొత్తతరం వైరస్‌ను కూడా నిలువరించ గలిగే సామర్థాన్ని కలిగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోసు కేవలం రూ.75కే అందుబాటులోకి వచ్చే అవకా శం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. అమెరికాలోని వర్జీనియా విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలతో కూడిన బృందం ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకం గా అభివృద్ధిచేసింది. సాధారణంగా 'పోర్కైన్ ఎపిడమిక్ డయేరియా వైరస్ (పీఈడీవీ)' అనే వైరస్ పందుల్లో డయేరియా, తీవ్ర జ్వరం తదితర ఇబ్బం దులను సృష్టిస్తున్నది. ఇది కూడా కరోనా కుటుంబానికి చెందిన వైరసేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ పరిశోధనల్లో భాగంగా పీఈడీవీ, కరోనా నివారణ వ్యాక్సిన్లను అభివద్ధి చేసినట్టు తెలిపారు. ఈ వ్యాక్సిన్లు .. కరోనా జాతికి చెందిన అన్ని వైరస్‌లపై ఉండే 'ఫ్యుజన్ పెప్టైడ్'లను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయి. అయితే ఇవి ఇన్ఫెక్షన్ను నిలువరించకున్నా వైరస్‌పై పోరాడేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని వేగంగా సన్నద్ధం చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా వైరస్ జన్యుక్రమంలో మార్పుల తోనే కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే.