Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రసీలియా : తాను సైగ చేస్తే చాలు సైన్యం వీధుల్లోకి వచ్చి వాలుతుంది. తన ఆదేశిస్తే, మిలిటరీ తు.చ తప్పక పాటిస్తుందంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో శుక్రవారం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. బ్రెజిల్‌పై సైనిక నియంతృత్వాన్ని రుద్దుతారా అన్న అనుమానాన్ని ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. మాజీ మిలిటరీ కెప్టెన్ అయిన బోల్సనారో శుక్రవారం ఒక టివి ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అంతకుమించి వివరించేందుకు ఆయన నిరాకరించారు. ''ఒకవేళ సమస్యలు ఉత్పన్న మైతే బరిలోకి దిగడంపై మాకు ఒక పథకం వుంది. ఒక్కరోజులో కావాలంటే మా సాయుధ బలగాలు వీధుల్లోకి రాగలవు.'' అని అన్నారు. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలు పోటాపోటీగా వున్న పక్షంలో అధికారాన్ని శాంతియుతంగా అప్పగించడంపై ఆయనకు గల నిబద్ధత పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.