Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన ఇండోనేషియా నేవీ
జకార్తా : బాలి తీరంలో బుధవారం నుండి ఆచూకీ తెలియకుండా పోయిన జలాంతర్గామి ఇక మునిగిపోయినట్లేనని ఇండోనేషియా నేవీ శనివారం ప్రకటించింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 53మంది వున్నారు. జలాంతర్గామి అదృశ్యమైన కొద్ది దూరంలోనే జలాంతర్గామి విడి భాగాలు, లోపల ప్రేయర్ చేసుకునే చాపలు, ఇతర శిధిలాలు కనుగొన్నట్లు నేవీ చీఫ్ తెలిపారు. 850మీటర్లు (2800 అడుగులు)లోతున జలాంతర్గామి వున్నట్లు స్కాన్‌లో వెల్లడైంది. అంటే అందులోని వారు జీవించడానికి అవకాశాలున్న స్థాయి దాటి అడుగుకు వెళ్ళిపోయింది. అందులో మూడు రోజులకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే వుంది. టార్పెడో డ్రిల్ సమయంలో మునగడానికి అనుమతి కోరిన తర్వాత అది కనిపించకుండా పోయింది. జర్మనీలో తయారైనన ఈ జలాంతర్గామి వయస్సు 40ఏళ్ళ పైమాటే. 2012లో దీనికి పూర్తిస్థాయిలో పునరుద్దరణ పనులు జరిగాయి. జలాంతర్గామి పూర్తిగా పనిచేసే కండీషన్లోనే వుందని నేవీ అధికారులు చెప్పారు. అయితే మునిగిన చోట చమురు తెట్టు కనిపిస్తుండడంతో బహుళా ఇంధన ట్యాంక్ దెబ్బతిని వుంటుందని ఆందోళనలు తలెత్తాయి.