Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : కోవిడ్-19 మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడదామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. ప్రపంచానికి ఈ వైరస్ విసురుతున్న సవాలును ఎదుర్కొనడంలో భారత దేశానికి సంఘీభావం ప్రకటించారు. పొరుగు దేశాలు, ప్రపంచంలో ఈ వ్యాధి బారిన పడినవారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ శనివారం ఓ ట్వీట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ శనివారం ఇచ్చిన ట్వీట్లో, భారతీయులు ప్రమాదకరమైన కోవిడ్-19 ప్రభంజనంతో యుద్ధం చేస్తున్నారని, వారికి సంఘీభావం ప్రకటిస్తున్నానని పేర్కొన్నారు. మానవాళి ఎదుర్కొంటున్న ఈ అంతర్జాతీయ సవాలుపై మనమంతా కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు.