Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేపిట (మయన్మార్) : మయన్మార్‌లో హింస తీవ్రరూపం దాల్చుతున్నది. తిరిగి పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ.. మయన్మార్ పౌరులు సైన్యంపై తిరుగుబాటు చేస్తున్నారు. గత ఫిబ్రవరిలో మయన్మార్ సైన్యం పౌర ప్రభుత్వాన్ని కూల్చి, దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) నాయకురాలు అంగ్‌సాన్ సూకీతో పాటు దేశ అధ్యక్షుడు యు విన్‌మైంట్‌ను అదుపులోకి తీసుకుంది. సైన్యం కాల్పుల్లో ఫిబ్రవరి ఒకటి నుంచి ఇప్పటివరకు 740 మంది మృతి చెందారంటే.. అక్కడి హింస ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.