Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 130 మంది మృతి
కైరో : మధ్యధరా సముద్ర తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. యూరప్ చేరుకోవటం కోసం బోటులో ప్రయాణిస్తున్న శరణార్థులు మధ్యధరా సముద్రంలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ తెలిపింది. 130 మందితో గురువారం యూరోప్‌కు బయలుదేరిన ఓ రబ్బర్ పడవను అధికారులు లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో శనివారం గుర్తించారు. దగ్గరకు వెళ్లి చూడగా అందులో ప్రజలెవరూ లేరు. దానికి తోడు చుట్టూ పదికి పైగా శవాలు నీటిలో కనిపించాయి. దీంతో వారంతా మరణించి ఉంటారని ఐక్యరాజ్యసమితి వలసదారుల సంక్షేమ విభాగం వెల్లడించింది. అంతేకాదు, అయితే ట్రిపోలికి తూర్పున ఓ రెండు రబ్బర్ పడవలను గుర్తించినట్లు లిబియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. దీంతో ప్రత్యేక పడవలను అక్కడికి పంపి వాటిలోని 106 మందిని రక్షించినట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో ఓ మహిళ, కొందరు పిల్లలు ఉన్నారు. పేదరికం, అంతరయుద్దం భరించలేక ఆఫ్రికా నుంచి చాలా మంది మెరుగైన జీవితం కోసం.. మధ్యధరా సముద్రం గుండా యూరప్ లోకి అక్రమంగా చొరబడుతున్నారు. ఇందుకోసం రబ్బరు బొట్లను ఉపయోగిస్తారు. వీటిలో పరిమితికి మించి వలసదారులను తీసుకెళ్తుంటారు. అలా 130 మందితో బయలుదేరిన ఓ బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 130 మంది మృతి చెందారు. అయితే ప్రత్యేక పడవలను అక్కడికి పంపి వాటిలోని 106 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఓ మహిళ, కొందరు పిల్లలు ఉన్నట్టు ఐఓఎం అధికారులు తెలిపారు. వీరిని చికిత్స కోసం సమీప ద్వీపంలోని ఆస్పత్రికి తరలించామని తెలియజేశారు.