Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : మార్స్ మీదికి చైనా ప్రయోగించిన తొలి రోవర్‌కు ఝురంగ్ అనే పేరు నిర్ణయించారు. చైనా సంస్కృతిలో అగ్ని దేవుడి పేరుతో ఈ పేరు పెట్టినట్లు ఆ దేశ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కాగా, ఈ రోవర్ వున్న అంతరిక్ష నౌక తియాన్వెన్-1 ఫిబ్రవరిలో మార్స్ కక్ష్యలోకి చేరుకుంటుందని, మేలో ఆ గ్రహంపై రోవర్ ల్యాండ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. 1976లో అమెరికా ల్యాండర్ వైకింగ్ 2 దిగిన యుటోపియా ప్లానిటియా అనే ప్రాంతంలోనే చైనా రోవర్ కూడా దిగుతుందని భావిస్తున్నారు.
కాగా, మార్స్ ఉపరితలాన్ని విశ్లేషించడం, మ్యాపింగ్ చేయడం, అధ్యయనం చేయడం వంటి లక్ష్యాలతో తియాన్వెన్-1ను గత ఏడాది జులైలో ప్రయోగించిన సంగతి తెలిసిందే. అలాగే మార్స్ ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేయడం, నీటి మంచు కోసం వెతకడం, అక్కడి వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం వంటి కార్యక్రమాలను చేయనుంది. రష్యా, అమెరికా తరువాత మార్స్‌పై రోవర్ ల్యాండ్ చేసిన మూడో దేశంగా చైనా అవతరించనుంది.