Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 82 మంది మృతి, 110 మందికి గాయాలు
బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసు కుంది. నగరంలోని ఒక ఆస్పత్రిలో అక్సిజన్ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం సంభవిం చింది. ఈ ఘటనలో 82 మంది చనిపోగా, 110 మందికి గాయాలయ్యాయని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరణించిన వారిలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న 28 మంది కరోనా రోగులు కూడా ఉన్నారని ఇరాక్ స్వతంత్ర మానవ హక్కుల సంఘం అధికార ప్రతినిధి అలి అల్-బయతి ట్వీట్ చేశారు. అగ్నిప్రమాదానికి ఆస్పత్రి యాజమాన్య నిర్లక్ష్య వైఖరే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అల్-ఖతిబ్ ఆస్పత్రి రెండో అంతస్తులోని అత్యవసర చికిత్స విభాగం(ఐసీయూ)లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని, మంటలను అదుపు చేశారు. కరోనా బారిన పడిన బాధితులకు ఈ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి బాధ్యులుగా చేస్తూ ఆస్పత్రికి చెందిన ఉన్నతాధికారులను విధుల నుంచి తొలగిస్తూ ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్-ఖదిమి ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రమాదంపై దర్యాప్తు జరిపి 24 గంటల్లోగా నివేదిక అందించాలని ప్రధాని ఖదిమి అధికారులను ఆదేశించారు. కాగా, ఇరాక్‌లో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ రోజుకు సరాసరిన 8 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలో 10లక్షలకు పైగా కేసులు వెలుగుచూడగా, దాదాపు 15,200 మంది కరోనాతో మరణించారు.