Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ఈ ఏడాది చైనా స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) వృద్ధిరేటు 8.1శాతం వుంటుందని అంచనా వేశారు. కరోనా వల్ల తలెత్తిన అనిశ్చిత పరిస్థితులు వున్నప్పటికీ దేశీయంగా వినిమయం క్రమంగా పెరుగుతుండడం, ఎగుమతులు బలోపేతం కావడంతో ఆర్థికవృద్ధి పెరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి) తన నివేదికలో పేర్కొంది. ఉపాధి మార్కెట్ మెరుగుపడడం, వినియోగదారుల్లో విశ్వాసం పునరుద్ధరణ, గృహావసరాలకు సంబంధించిన డిమాండ్ అమాంతంగా పెరగడం ఇవన్నీ ఈ పరిస్థితికి కారణమయ్యాయని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. 2022లో జిడిపి వృద్ధిరేటు 5.5శాతంగా వుండగలదని అంచనా వేశారు. ఆర్తిక వ్యవస్థ కోలుకకోవడంతో ప్రజా వినిమయం తిరిగి సాధారణ స్థాయికి వస్తుండడం ఈ ఏడాది వృద్దికి ప్రధాన కారణం. ఆ తర్వాత తయారీ రంగంలో పెట్టుబడులు రెండో కారణమని ఎడిబి ఆర్థిక విభాగ అధినేత డొమినిక్ పెచల్ వ్యాఖ్యానించారు. ఆసియావ్యాప్తంగా గత వారం కన్నా ఈవారం కొవిడ్ కేసులు పెరిగాయి. దీనివల్ల ఈ ప్రాంత ఆర్థిక పునరుద్ధరణపై ప్రభావం వుంటుందని భావిస్తున్నారు. దీనికి భిన్నంగా చైనాలో ఆర్థిక పరంగా సాధారణ క్రమం మొదలైంది. కరోనా కట్టడి చర్యలు కొనసాగుతున్నాయి, వ్యాక్సినేషన్ క్రమాన్ని పెంచారని నిపుణులు పేర్కొంటున్నారు.
చైనా రోదసీ స్టేషన్ అమలు దిశగా తొలి అడుగు!
రోదసీలోకి మానవుడు తొలి అడుగు వేసిన 60ఏళ్ల తర్వాత గురువారం చైనా తన రోదసీ స్టేషన్‌కి సంబంధించిన కీలకమైన కాప్స్యూల్‌ను ప్రయోగించింది. దీంతో అత్యంత ఆధునాతనమైన రోదసీ ఆధారిత కేంద్రాల్లో ఒకదాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లైంది.
హైనన్ ప్రావిన్స్‌లోని వెన్చాంగ్ స్పేస్ లాంచ్ సెంటర్లో ఉదయం 11.23గంటలకు లాంగ్ మార్చ్ 5బి హెవీ లిఫ్ట్ కేరియర్ రాకెట్‌ను ప్రయోగించగానే దట్టమైన మేఘాల గుండా ఆకాశంలోకి దూసుకుపోయింది. 18అంతస్తుల ఎత్తైన ఈ వెహికల్‌ను ఎత్తడానికి 1068 మెట్రిక్ టన్నుల శక్తిని ఉపయోగించారు. దీనికి 10ఇంజన్లు వున్నాయి. 15సాధారణ సైజుల్లోని కార్లున్నింటినీ కలిపితే వుండే బరువుకు ఈ కాప్స్యూల్ బరువు సమానం. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ, స్టేట్ కౌన్సిల్, కేంద్ర మిలటరీ కమిషన్, అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రభృతులు అభినందనలు తెలియచేశారు. ఈ ప్రయోగంతో చైనా రోదసీ స్టేషన్ నిర్మాణం పూర్తి అమలు దశకి చేరిందని జిన్‌పింగ్ తన సందేశంలో పేర్కొన్నారు. తర్వాత కాలంలో చేపట్టాల్సిన కర్తవ్యాలకు ఇదొక గట్టి పునాదిని వేస్తుందని వ్యాఖ్యానించారు.