Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలేం: వచ్చే నెల్లో జరగాల్సి వున్న పార్లమెంట్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ గురువారం ప్రకటించారు. అధికారాలపై గల తనకు గల పట్టును బలహీనపరుస్తామని సొంత పార్టీ నుండే బెదిరింపులు రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 15 సంవత్సరాలుగా ప్రతిష్టింభించిన, చీలికలు వచ్చిన నాయకత్వానికి స్వస్తి పలికేందుకు ఈ చారిత్రక ఎన్నికలు జరగాల్సి వుంది. సుదీర్ఘ కాలంగా ఈ ఎన్నికలు ఇలా వాయిదా పడుతునే వస్తున్నాయి. ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతుందనగా అబ్బాస్ నిర్ణయం వెలువడింది. దీంతో మే 22న జరగాల్సిన ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆతర్వాత జులైలో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికలు కూడా వాయిదా పడినట్లే కాగలదు. గత దశాబ్దంన్నర కాలంగా ఎన్నికలు నిర్వహించని, ఇజ్రాయిల్ నుండి స్వాతంత్య్రం సాధిస్తామన్న లక్ష్యాన్ని సాధించని అధ్యక్షుడిని మార్చాలని పాలస్తీనియన్లు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ దశలో మళ్లీ ఎన్నికలు వాయిదా పడడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్ బ్యాంక్, గాజాల్లో పలు నగరాల్లో వీధుల్లోకి పెద్ద సంఖ్యలో వచ్చి నిరసనలు చేపట్టారు.