Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా హామీ
వాషింగ్టన్: సిగరెట్లు, చుట్టల్లో మెంథాల్ వాడకాన్ని నిషేధించడానికి ప్రయత్నిస్తామని అమెరికా మళ్ళీ హామీ ఇచ్చింది. పొగ త్రాగేవారిలో బాగా పాపులర్ అయిన ఈ మింట్ ఫ్లేవర్‌ను తొలగించాలని ఆఫ్రికన్ అమెరికన్ గ్రూపుల నుండి వచ్చిన ఒత్తిడి మేరకు ఈ హామీ ఇచ్చింది. మెంథాల్‌ను తొలగించడానికి చాలాసార్లు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) విభాగం ప్రయత్నించింది. కానీ బడా పొగాకు సంస్థలు, కాంగ్రెస్ సభ్యులు నుండి వచ్చిన ఒత్తిళ్ళకు, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా తలొగ్గాల్సి వచ్చింది. ఒబామా, ట్రంప్ ప్రభుత్వ హయాముల్లో ఇదే పరిస్థితి కొనసాగింది. మెంథాల్ నిషేధం అమల్లోకి రావడానికి ఏళ్ళ తరబడి పడుతుంది. పొగాకు కంపెనీల నుండి చట్టపరమై సవాళ్ళను కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు. దీనిపై అంతిమంగా ఒక నిర్ణయం తీసుకోవాలంటూ గత వేసవిలో పొగ త్రాగడాన్ని వ్యతిరేకించే గ్రూపులు, వైద్య బృందాలు పిటిషన్ దాఖలు చేశాయి.. దానిపై విచారణ సందర్భంగా గురువారం ఈ ప్రకటన వెలువడింది. యువతలో ముఖ్యంగా నల్ల జాతీయులైన యువతలో తక్కువ ఖరీదుండే, ఈ తరహా చిన్న చుట్టలు, సిగరెట్లు ఎక్కువ ప్రజాదరణ పొందాయి.