Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలేం: ఇజ్రాయిల్లో శుక్రవారం తెల్లవారుజామున మతపరమైన కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 44మంది మరణించారు. దాదాపు 150మంది గాయపడ్డారని, వారిలో మరో 40మంది పరిస్థితి విషమంగా వుందని అధికారులు తెలిపారు. ఉత్తర ఇజ్రాయిల్లో పవిత్ర స్థలం మౌంట్ మెరాన్లో జరిగిన ఈ వేడుకలకు లక్ష మంది వరకు హాజర య్యారని భావిస్తున్నారు. మౌంట్ మెరాన్లో ప్రతి ఏటా జరిగే ఈ మతప రమైన కార్యక్రమంలో వేలాదిమంది పాల్గొంటూ వుంటారు. అయితే కరోనా కారణంగా గతేడాది వీటిని రద్దు చేశారు. ఈ ఏడాది అక్కడ పరిస్థితులు మెరుగ్గా వుండడంతో పండుగ సంబరాలకు అనుమతినిచ్చారు. దాంతో ఆ చిన్న ప్రాంతంలోనే దాదాపు లక్ష మంది వరకు గుమిగూడారని అధికారులు చెబుతున్నారు. ఇరుకుగా వున్న సొరంగం లాంటి మార్గం నుంచి బయటకు రావడానికి పెద్దసంఖ్యలో ప్రజలు ఒక్కసారిగా ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.