Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన పెంటగాన్
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన మెక్సికోతో సరిహద్దు గోడ నిర్మాణ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పెంటగాన్ ప్రకటించింది. మిలటరీ నిధులను, బడ్జెట్లో కేటాయించి ఖర్చు కాకుండా మురిగిపోయిన నిధులను ఉపయోగించి ఈ గోడ నిర్మాణానికి గత ట్రంప్ ప్రభుత్వం పూనుకుంది. అమెరికా దక్షిణ సరిహద్దులోని ఈ గోడ నిర్మాణానికి నిధులు మళ్లించడం కోసం 2019లో జాతీయ ఎమర్జెన్సీని ట్రంప్ ప్రకటించారు. జోబైడెన్ జనవరి 20న కొత్త అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సరిహద్దు గోడ నిర్మాణ ప్రాజెక్టులన్నిటినీ ఆపేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అందచేస్తున్న నిధుల చట్టబద్ధతను, కాంట్రాక్ట్ పద్ధతులను సమీక్షించాలన్నారు. సైనికుల పిల్లలకు స్కూళ్ళ నిర్మాణానికి, విదేశాల్లో భాగస్వామ్య దేశాలతో కలిసి మిలటరీ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టడానికి, జాతీయ రక్షణ బలగాల, రిజర్వ్ బలగాల సామాగ్రి కోసం ఈ నిధులను ఖర్చు చేయాల్సి వుండగా వాటిని గోడ నిర్మాణానికి మళ్లించడాన్ని బైడెన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.