Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో: యురోపియన్ యూనియన్‌కి చెందిన ఎనిమిది మంది అధికారులను రష్యా శుక్రవారం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. రష్యన్ ప్రతిపక్ష నేత అలెక్సి నావల్నెకి జైలుశిక్ష అమలు చేసినందుకు గానూ ఇయు విధించిన ఆంక్షలకు ప్రతిగా ఈ చర్యలు తీసుకుంది. యురోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు డేవిడ్ సాసొలి, యురోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు వెరా జురొవాలు బ్లాక్‌లిస్ట్ జాబితాలో వున్నారు. యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్, యురోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్‌డెర్ లేయన్ రష్యా చర్యను ఖండించారు. ఈ చర్యకు ఎలాంటి ఆమోదయోగ్యత లేదని, చట్టబద్ధమైన సమర్ధన లేదని విమర్శించారు. కేవలం నిరాధారమైన చర్య అని వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో తలెత్తిన ప్రతికూల పంథాను పరిష్కరించేందుకు అంగీకరించడానికి బదులుగా ఇయుతో ఘర్షణా వైఖరిని ఎంచుకోవడం విచారకరమని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై తగు రీతిలో ప్రతిస్పందించే హక్కును ఇయు అట్టిపెట్టుకుందని అన్నారు. స్వతంత్ర విదేశాంగ, దేశీయ విధానాలను అనుసరించినందుకు రష్యాను శిక్షించాలని ఇయు ప్రయత్నిస్తోందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. చట్టవిరుద్దమైన ఆంక్షల ద్వారా తమ అభివృద్ధిని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించింది.