Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: ఇరవై ఏళ్ల పాటు సాగించిన యుద్ధం అనంతరం అమెరికన్ బలగాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి తిరిగి వెనక్కి వెళ్లే ప్రక్రియ శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. ట్రంప్ ప్రభుత్వం తాలిబాన్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మే1 నాటికి దళాలను మొత్తంగా ఉపసంహరించుకోవాల్సి ఉంది. బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గడువును సెప్టెంబరు11 వరకు పొడిగించింది. మే నాటికి దళాలను వెనక్కి తీసుకోని పక్షంలో అమెరికా దళాలపై దాడులు చేస్తామని తాలిబాన్లు హెచ్చరించారు. దీంతో మే1 నుండి అంచెలంచెలుగా దళాలను ఉపసంహరించుకుంటామని అమెరికా తెలిపింది. అమెరికన్ దళాలు వెనక్కి వెళ్లే క్రమంలో వారికి రక్షణకుగాను అమెరికా ఇటీవల మరి కొన్ని అదనపు బలగాలను ఆఫ్ఘనిస్తాన్‌కు పంపింది. కాబూల్, సమీపంలోని బగ్రామ్ వైమానిక స్థావరం వద్ద అమెరికా హెలికాప్టర్ల కార్యకలాపాలు పెరిగాయి. నాటో బలగాల ఉపసంహరణ ప్రక్రియ రెండు రోజుల క్రితమే మొదలైంది.సుదీర్ఘ కాలంపాటు సాగిన ఈ యుద్ధంలో2,400 మంది అమెరికన్ సైనికులు, 3,800 మంది కాంట్రాక్టర్లు, 47,000 మంది ఆఫ్ఘన్ పౌరులు చనిపోయారు. ఈ అనవసర యుద్ధం కోసం అమెరికన్లు పన్నుల రూపంలో చెల్లించిన రెండు లక్షల కోట్ల రూపాయలు వృథా చేసింది. ఒబామా ప్రభుత్వం 2009లో ఆప్ఘన్లో అమెరికా సైనికుల సంఖ్య గరిష్ట స్థాయిలో లక్షకు చేరింది. ఇటీవలి స్థానిక అంచనాల మేరకే దేశంలో సగభాగానికి పైగా తాలిబాన్ మిలిటెంట్ల అధీనంలో ఉన్నట్లు తేలింది. ఆఫ్ఘన్ నుంచి దళాలను ఉపసంహరణ చేపట్టిన బైడెన్ ప్రభుత్వం రష్యాకు చెక్ పెట్టేందుకు దాని చుట్టూ ఉన్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్‌లలో దళాలను మరింతగా మోహరించాలని నిర్ణయించింది.