Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: భారత్లో కరోనా విజృంభిస్తోంది. గత వారం రోజులుగా మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతూ.. శనివారానికి నాలుగు లక్షల కేసుల్ని దాటాయి. మరణాలు కూడా అత్యధిక సంఖ్యలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి అమెరికా అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచీ కొన్ని సలహాలిచ్చారు. భారత్లో కరోనా కట్టడికి కొన్నివారాలపాటు లాక్డౌన్ తప్పనిసరి అని ఆయన అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలందరికీ టీకాలు తప్పనిసరిగా వేయాలని సూచించారు. ఇక ఆక్సిజన్ కొరతపై కూడా ఆయన స్పందించారు. ముందుగా ఆక్సిజన్ కొరత తీరాలంటే.. యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించి, ఉత్పత్తిని పెంచాలన్నారు. అలాగే కోవిడ్ చికిత్స నిమిత్తం.. తాత్కాలిక ఆసుపత్రులను ఎక్కువగా ఏర్పాటు చేయాలని... దీనికి అమెరికా అనుసరించిన విధానాలను పాటించాలని భారత్కు సూచించారు. ఇటువంటివి చేస్తేనే కరోనా పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావచ్చన్నారు.