Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాస ఆందోళన
న్యూయార్క్ : ప్రపంచంలోని నిరుపేద దేశాల్లో ఐక్యరాజ్య సమితి చేపట్టే కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి తమ వంతువాటాగా ఇచ్చే నిధుల్లో 85శాతం మేర కోత పెట్టాలని బ్రిటన్ భావిస్తుండడం పట్ల ఐరాస కుటుంబ నియంత్రణ సంస్థ (యుఎన్ఎఫ్పిఎ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అత్యంత వినాశకరమైన చర్య. 2021లో యుఎన ్ఎఫ్పిఎ సరఫరాల కోసం 15.4 కోట్ల పౌండ్లు ఖర్చు పెట్టేందుకు బ్రిటన్ తొలుత వాగ్దానం చేసింది. తాజా నిర్ణయంతో ఈ సాయం కేవలం 22.3 కోట్ల పౌండ్లకు పడిపోనుందని యుఎన్ఎఫ్పిఎ తెలిపి ంది. కుటుంబ నియంత్రణ కోసం సంస్థ చేపట్టే కార్యక్రమాలకు ఈ నిధులు ఉపయోగిస్తారు. ఈ కోతల వల్ల ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతాయని యుఎ న్ఎఫ్పిఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాలియా కనెమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న 130మిలియన్ల పౌండ్లతో దాదాపు రెండున్నర లక్షలమంది ప్రసూతి, శిశు మరణాలను నివారించడానికి, 1.46లక్షల అవాంఛనీయ గర్భధారణలు, సురక్షితం కాని 43లక్షల అబార్షన్లను నివారించడానికి సాయపడుతుందని ఆ ప్రకటన పేర్కొంది. పై మొత్తాలు కాకుండా, యుఎన్ఎఫ్పిఎ కీలక నిర్వహణ నిధుల నుండి 1.2 కోట్ల పౌండ్లు కోత పడనుందని నటాలియా తెలిపారు.