Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్: భారత్ నుంచి వచ్చే వారిపై నిషేధం విధించడాన్ని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోర్రీస్ సమర్థించుకున్నారు. దేశ ఉత్తమ ప్రయోజనాల కోసం, మూడో దశ ఇన్ఫ్ఫెక్షన్లను నివారించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ఆయన తెలిపారు. ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారిగా భారత్ నుంచే వచ్చేవారిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నిషేధం ఉల్లంఘించి వచ్చే వారికి ఐదేళ్లు జైలు లేదా 66 వేల ఆస్ట్రేలియా డాలర్లు జరిమానా విధించే అవకాశముందని కూడా ఆసీస్ ప్రభుత్వం హెచ్చరించింది. దీనిపై మోర్రీస్ స్పందింస్తూ ఇది తాత్కాలికమైన ఏర్పాటు అని, అలాగే చాలా తీవ్రమైన నిర్ణయని అన్నారు. 'ఆస్ట్రేలియాలో మూడో దశను నివారించడానికి, క్వారంటైన్ వ్యవస్థను మరింత బలంగా ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం' అని తెలిపారు. భారత సమాజానికి ఈ నిర్ణయం బాధకరంగా ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా ప్రధాని వ్యక్తం చేశారు. వైద్య అధికారుల నుంచి వచ్చిన సలహా మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.