Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26మంది మృతి, పలువురు గల్లంతు
ఢాకా: బంగ్లాదేశ్లో బోటు బోల్తా పడిన ఘటనలో 26మంది మరణించారు. ఇసుకతో నిండిన బోటును ఢకొీన్న అనంతరం ఈ స్పీడు బోటు బోల్తా పడి పలువురు గల్లంతయ్యారని పోలీసులు సోమవారం తెలిపారు. జనాలతో బోటు కిక్కిరిసి వుండడం, పైగా అనుభవం లేని వ్యక్తి నడపడమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. బంగ్లా బజార్ ఫెర్రీ ఘాట్లో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు సహాయక సిబ్బంది 26మృత దేహాలను వెలికితీశారని పోలీసులు తెలిపారు. మరో ఐదుగురిని కాపాడారు. అయితే చాలామంది గల్లంతయ్యారని భావిస్తున్నామని, వారి కోసం గాలిపు జరుగుతోందని సంఘటనా స్థలం వద్ద పోలీసు అధికారి విలేకర్లకు చెప్పారు. స్పీడ్ బోటు నడిపే కుర్రాడు చిన్నవాడని, అనుభవం లేదని పక్క ఫెర్రీ టెర్మినల్ పోలీసు ఇనస్పెక్టర్ చెప్పారు. బోటులో 30మందికి పైగా ప్రయాణికులు వున్నారు.