Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అనుమానిత తీవ్రవాదులపై ట్రంప్ హయాంలో అమలు చేసిన నిబంధనలను బైడెన్ ప్రభుత్వం తాజాగా బయటపెట్టింది. ఆనాడు వాటిని బహిర్గతం చేయడానికి ట్రంప్ సర్కార్ తిరస్కరించింది. విదేశాల్లోని తీవ్రవాద అనుమానితులపై ఈ నిబంధనలను అమలు చేసేవారు. కొన్ని భాగాలను బైడెన్ ప్రభుత్వం సెన్సార్ చేసినప్పటికీ విడుదల చేసిన భాగాలను చూస్తుంటే దాడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఈ రంగంలోని కమాండర్లకు ట్రంప్ ఇచ్చారు. ఈ తరహాలో చేపట్టే ఆపరేషన్లలో పౌరులు గాయపడడం కానీ, ప్రాణ నష్టం కానీ ఉండదనుకుంటే దాడులకు అనుమతి ఇచ్చేవారని తెలుస్తోంది. ఈ నిబంధనలన్నింటినీ బైడెన్ అధికారంలోకి వచ్చిన తొలిరోజే సస్పెండ్ చేశారు. ''తీవ్రవాద లక్ష్యాలపై నేరుగా దాడి జరపడానికి నిబంధనలు, ప్రమాణాలు, పద్ధతులు'' అనే శీర్షికతో ఈ నిబంధనలు వున్నాయి. తీవ్రవాద గ్రూపు నుండి ఎదురయ్యే ముప్పును పరిష్కరించేందుకు అమెరికా చేపట్టాల్సిన తక్షణ చర్యలను ఈ నిబంధనల కింద అనుమతిస్తారు. 2017 డిసెంబరులో అమెరికన్ పౌర హక్కుల యూనియన్ (ఎసిఎల్యు), న్యూయార్క్ టైమ్స్ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన ఫెడరల్ జడ్జి గత అక్టోబరులో ఇచ్చిన రూలింగ్ మేరకు ఈ నిబంధనలను విడుదల చేశారు.