Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాకు వచ్చే వార్షిక శరణార్ధుల ప్రవేశ పరిమితిని 62,500కి పెంచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సోమవారం ప్రకటించారు. వచ్చే ఏడాది కల్లా ఈ సంఖ్యను రెట్టింపు చేయాలన్నది లక్ష్యంగా వుందన్నారు. ఈ సంఖ్యను ఫిబ్రవరిలోనే ప్రభుత్వం కాంగ్రెస్ అధికారులకు సిఫార్స చేసింది. కానీ, ట్రంప్ ప్రభుత్వం ఆనాడు చారిత్రక స్థాయిలో ఎన్నడూ లేని రీతిలో నిర్ణయించిన 15వేల మంది శరణార్ధుల లక్ష్యాన్నే కొనసాగించాలని ఏప్రిల్‌లో వైట్‌హౌస్ నిర్ణయించింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ప్రకటన వెలువడిన వెంటనే ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తూ తుది సంఖ్యపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఎట్టకేలకు, బైడెన్ ప్రభుత్వం సోమవారం ప్రకటన చేస్తూ, తొలిగా పేర్కొన్న సంఖ్యపైనే పరిష్కారం కుదిరిందని తెలిపింది. అయితే సెప్టెంబరుతో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న 62,500 అడ్మిషన్లను సాధించలేకపోవడం విచారకరమని పేర్కొంది. గత నాలుగేళ్ళుగా జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి కొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించింది.