Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇజ్రాయిల్‌లో మరోసారి ఎన్నికలు తప్పవా?
జెరూసలేం : కొత్త ఇజ్రాయిలీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బెంజామిన్ నెతన్యాహుకి వున్న గడువు బుధవారం తెల్లవారు జాముతో ముగిసింది. సుదీర్ఘకాలం ప్రధానిగా వున్న ఆయన రెండేళ్లకు పైగా నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమయ్యారు. కొత్త సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడంలో నెతన్యాహు విఫలమ య్యారు. ఆ తర్వాత నెతన్యాహు తాత్కాలిక ప్రభుత్వానికి వెలుపల గల పార్టీలన్నీ తమ విభేదాలను విస్మరించి ఒకటై నెతన్యాహును తొలగించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. 2009 నుండి నెతన్యాహు అధికారంలో వున్నారు. 1990వ దశకంలో మూడేళ్లపాటు ప్రధానిగా వున్నారు. 2019 నుండి వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన పోరాడు తున్నారు. పైగా నేరపూరితమైన అవినీతి ఆరోపణలపై ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. అర్ధరాత్రి గడువు ముగిసిన తర్వాత, సంకీర్ణాన్ని నిర్మించే బాధ్యతను అధ్యక్షుడు రీవెన్ రివ్లిన్ మరో ఎంపికి అప్పగించవచ్చని భావిస్తున్నారు. మార్చి 23న జరిగిన ఓటింగ్‌లో నెతన్యాహు లికుడ్ పార్టీ తర్వాత రెండవ స్థానంలో నిలిచిన సెంట్రిస్ట్ యష్ అటిడ్ పార్టీ నేత యార్ అపిడ్కి అప్పగిస్తారని ఆశిస్తున్నారు. ఈ ఎన్నికల్లో నెతన్యాహు వర్గం మెజారిటీ సాధించడంలో విఫలమైంది. దాంతో సంకీర్ణానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆయన్ని తొలగించడానికి ఎత్తులు మొదలాయ్యయి. 28రోజుల్లోగా కొత్త ప్రధానిని అధ్యక్షుడు నియమించలేకపోతే మూడు వారాల్లోగా మరో అభ్యర్ధిపై అంగీకారానికి రావాలని పార్లమెంట్‌ను కోరవచ్చు, అది కూడా సాధ్యం కాకపోతే మరోసారి ఎన్నికల నిర్వహణ తప్పదు.